Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిరుదులపై మత్తు ఇంజెక్షన్ వేసి బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం ... నిదింతుడూ సూసైడ్

రాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్‌ కుమార్‌ కోసం ప

పిరుదులపై మత్తు ఇంజెక్షన్ వేసి బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం ... నిదింతుడూ సూసైడ్
, సోమవారం, 27 ఆగస్టు 2018 (08:42 IST)
రాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్‌ కుమార్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్‌ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
 
రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ, హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. 
 
వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నూతన్‌ కుమార్‌, పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్‌ కుమార్‌ పరారయ్యాడు. దీంతో నూతన్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో పద్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై లైంగిక దాడి, హత్య చేసిన తర్వాత పరారైన నూతన్‌ కుమార్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్‌ మృతదేహం లభించింది. నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అందర్నీ కలేసికొడతారు : కేఈ కృష్ణమూర్తి