Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గాఢనిద్రలో ఉంటే... కుమార్తె నోటికి ప్లాస్టర్ వేసి రేప్ చేసిన తండ్రి

ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో దారుణం జరిగింది. పక్కనే భార్య గాఢ నిద్రలో ఉండగా, కన్నబిడ్డపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ అంటించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:14 IST)
ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో దారుణం జరిగింది. పక్కనే భార్య గాఢ నిద్రలో ఉండగా, కన్నబిడ్డపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ అంటించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నోయిడాకు చెందిన భార్యభర్తలిద్దరూ స్థానికంగా ఉండే బట్టల ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తండ్రి బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి సమయంలో భార్య గాఢనిద్రలోకి జారుకోగానే, మరో గదిలో నిద్రపోతున్న కుమార్తె నోటికి ప్లాస్టర్ అంటించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆ చిన్నారికి రక్తస్రావమై నరకయాతన అనుభవించింది. 
 
మరుసటిరోజు ఉదయం బిడ్డతో కలిసి స్టేషన్‌కు వెళ్లి భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments