Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేస్తే.. 11 మందిని పంపి అత్యాచారం చేయించాడు...

ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు.

Advertiesment
సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేస్తే.. 11 మందిని పంపి అత్యాచారం చేయించాడు...
, సోమవారం, 20 ఆగస్టు 2018 (11:59 IST)
ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని లాహోర్‌దగాకు సమీపంలోని సర్దార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై లాహోర్‌దగా నుంచి మరో ప్రాంతానికి బయలుదేరారు.

అయితే, వీరి వాహనం మధ్యలో చెడిపోయింది. దీంతో ఆ బాలికలు సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు.. తన 11 మంది స్నేహితులను ఆ ప్రాంతానికి పంపించాడు.
 
అక్కడికి చేరుకున్న 11 మంది బాలికలతో ఉన్న వ్యక్తిని చితకబాది.. మైనర్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈనెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్ నుంచి సునైనా అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న తనీష్