సవతి కుమార్తెపై కొడుకుతో అత్యాచారం చేయించింది.. అదీ ఆమె కళ్లముందే?

సవతి కుమార్తె పట్ల ఓ మహిళ కిరాతకురాలిగా మారింది. సవతి కుమార్తెపై తన కుమారుడు.. అతని స్నేహితులతో అత్యాచారం చేయించింది. అంతటితో ఆగని ఆ దుర్మార్గురాలు.. అత్యాచారానికి అనంతరం గొంతునులిమి చంపి, కళ్లు పీకిం

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:47 IST)
సవతి కుమార్తె పట్ల ఓ మహిళ కిరాతకురాలిగా మారింది. సవతి కుమార్తెపై తన కుమారుడు.. అతని స్నేహితులతో అత్యాచారం చేయించింది. అంతటితో ఆగని ఆ దుర్మార్గురాలు.. అత్యాచారానికి అనంతరం గొంతునులిమి చంపి, కళ్లు పీకించి, యాసిడ్‌ పోయించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. బారాముల్లా జిల్లా, యురికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. అతడు రెండో భార్యతోనే ఎక్కువ సమయం గడపడం, ఆమె కూతురంటే వల్లమాలిన ప్రేమ చూపడం మొదటి భార్యకు నచ్చలేదు. ద్వేషం పెంచుకున్న ఆ మహిళ ఆ చిన్నారిని చంపేందుకు పథకం పన్నింది.
 
ఆగస్టు 23వ తేదీన పదునైన కత్తిని వెంట తెచ్చుకున్న ఆ మహిళ.. సవతి కూతురు(9)ను వెంటబెట్టుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అడవిలోకి వెళ్లాక పక్కా ప్లాన్ ప్రకారం.. ఆమె చూస్తుండగానే.. కుమారుడు (14), అతని స్నేహితులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ.. బాలిక గొంతు నులిమి చంపింది. ఆమె కుమారుడు చిన్నారి తలపై గొడ్డలితో మోదాడు. ఆపై గొంతు నులిమి చంపి, కళ్లు పీకించి, యాసిడ్‌ పోయించింది. ఆపై మృతదేహాన్ని పొదల్లో దాచి, ఆకులు, కొమ్మలతో కప్పి వేసి ఇళ్లకు చేరుకున్నారు. 
 
తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించినట్లు గ్రామస్తులు ఆదివారం సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సవతి తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. మృతురాలి సవతి తల్లి, సవతి సోదరుడితోపాటు ఐదుగురిని అరెస్ట్‌చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments