Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్కె తీర్చలేదని కోడలిని చంపి సూసైడ్ చేసుకున్న మామ...

కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు.

Advertiesment
కోర్కె తీర్చలేదని కోడలిని చంపి సూసైడ్ చేసుకున్న మామ...
, బుధవారం, 29 ఆగస్టు 2018 (10:29 IST)
కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు. ఈ విషయం గ్రహించిన కోడలు.. మామను ఓ కంట కనిపెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో కోర్కె తీర్చాలంటూ కోడలిని మామ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 
దీంతో ఆవేశం ఆపుకోలేని మామ రోకలిబండతో కోడలిని కొట్టి చంపాడు. ఆమె చనిపోవడంతో భయపడిన మామ, ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరికృష్ణ మృతి.. జగన్మోహన్ రెడ్డి సంతాపం.. సీటు బెల్టు పెట్టుకోలేదు..