Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెస్ వాడియాతో వివాదం.. ప్రీతిజింటా స్పందించాలి.. హైకోర్టు ఆదేశం

బాలీవుడ్ నటి ప్రీతీజింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా వ్యవహారం నాలుగేళ్ల క్రితం సంచలనానికి దారితీసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రీతీ జింతాను వేధించాడని నెస్ వాడియాపై దాఖలైన కేసు ప్రస్తుతం ముంబై హైక

Advertiesment
Bombay HC
, గురువారం, 2 ఆగస్టు 2018 (19:06 IST)
బాలీవుడ్ నటి ప్రీతీజింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా వ్యవహారం నాలుగేళ్ల క్రితం సంచలనానికి దారితీసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రీతీ జింతాను వేధించాడని నెస్ వాడియాపై దాఖలైన కేసు ప్రస్తుతం ముంబై హైకోర్టు పరిధిలో వుంది. ఈ కేసులో ఐపీఎల్ 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్' ఆతిథ్యం విభాగ మేనేజర్ తారా శర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ప్రీతీ, నెస్ వాడియా మధ్య గొడవ వాస్తవమేనని తేలింది. 
 
మే 30న స్టేడియంలో సీట్ల కేటాయింపుపై వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదన జరిగిందని తారా శర్మ అప్పట్లో తెలిపారు. అదే సమయంలో తనపైనా నెస్ అరిచారని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు బాంబే హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా కోర్టు ప్రీతి జింటాను ఆదేశించింది. ఈ కేసును కొట్టి వేయాలని పిటిషన్ దాఖలు చేసిన నెస్ వాడియా, తామిద్దరమూ నాటి ఘటనను మరచిపోవాలని నిర్ణయించుకున్నట్టు న్యాయవాది ద్వారా చెప్పించారు. 
 
ప్రస్తుతం ప్రీతీ జింటా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటోందని, తాము కలసి ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొన్నామని చెప్పారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆర్ఎం సావంత్, జస్టిస్ రేవతీ మోహితే, కేసును కొట్టి వేయడంపై అభిప్రాయం తెలపాలని ప్రీతిని ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎడ్‌బాస్టన్ టెస్ట్ : రెండో రోజు రెండు పరుగులే.. ఇంగ్లండ్ 287 ఆలౌట్