సంతానం కలుగలేదని.. కోలీవుడ్ నటుడి భార్య ఉరేసుకుంది..

కోలీవుడ్‌లో ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే, యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో సిద్ధార్థ్,

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:36 IST)
కోలీవుడ్‌లో ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే, యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో సిద్ధార్థ్, స్మిరిజ దంపతులు నటించారు. వీరికి వివాహమై మూడు సంవత్సరాలు గడిచినా పిల్లలు కలుగలేదు. 
 
పిల్లల విషయంలో లోపం నీలో ఉందంటే, నీలో ఉందంటూ, ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను తీసుకుని హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వచ్చిన సిద్ధార్థ్, ఇంటికి వచ్చిన తరువాత ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. 
 
సిర్మిజ ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా, సిద్ధార్థ్ బయట హాలులో పడుకున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటలైనా భార్య బయటకు రాకపోవడంతో తలుపులు తట్టాడు. 
 
లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో మధురవాయిల్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి తలుపులు పగులకొట్టగా.. సిర్మిజా లోపల ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments