Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో దారుణం - కడియాల కోసం కాళ్లు తెగనరికేశారు..

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (17:19 IST)
దేశంలో పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ శతాధిక వృద్ధురాలి కాళ్ళకు ధరించిన కడియాల కోసం రెండు కాళ్లను తెగనరికేశారు. ఈ దారుణం జైపూర్ నగరంలోని గాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో వందేండ్ల వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి దొంగ‌లు ఆమె రెండు కాళ్ల‌ను తెగ న‌రికేసి క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.
  
బ‌య‌టికి వెళ్లిన మ‌నుమ‌రాలు ఇంటికి వ‌చ్చేస‌రికి వృద్ధురాలు రెండు కాళ్ల‌ను కోల్పోయి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి బోరున విలపిస్తూ కనిపించింది. ఆ దృశ్యాల‌ను చూసి భ‌య‌ప‌డిపోయిన ఆమె వెంట‌నే త‌న త‌ల్లికి ఫోన్ చేసి విష‌యం చెప్పింది. 
 
ఇంతలో ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసుల‌కు సమాచారం చేరవేశారు. దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ హృద‌య‌విధార‌క ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments