Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 3 March 2025
webdunia

ఫస్ట్ నైట్ రోజే షాక్.. కొత్త పెళ్లి కూతురు ఏం చేసిందంటే?

Advertiesment
bride
, బుధవారం, 10 ఆగస్టు 2022 (19:21 IST)
ఫస్ట్ నైట్ రోజే అందరికీ ఊహించని షాక్ ఇచ్చి.. వారి సంతోషాన్ని కాస్తా దుఖమయం చేసేసింది ఆ పెళ్లి కూతురు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కోట్‌పుట్లీ పట్టణానికి చెందిన వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతికి పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి తంతు ముగిశాక.. నవ వధువును పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువచ్చారు. వారి ఫస్ట్ నైట్ కోసం పెద్దలు ఏర్పాటు చేశారు. 
 
ఇంతలో అందరూ కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త కోడలే వారికి భోజనం వడ్డించింది. తాను తప్ప.. భర్త, అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. ఆమె వడ్డించిన భోజనంలో మత్తు మందు కలిపింది పెళ్లి కూతురు. అది తెలియక.. ఆ భోజనం తిన్నవారంతా అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. 
 
ఇంకేముంది.. ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు అన్నీ ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. అందరూ అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నారు. 
 
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పెళ్లి కూతురు పెద్ద చీటర్ అని తేల్చారు. పరారీలో ఉన్న పెళ్లి కూతురు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరంట్ల మాధవ్‌ వీడియో ఫేక్.. అనంతపురం జిల్లా ఎస్పీ