ఆమె పేరువింటేనే వణికిపోతున్న ప్రధాని మోడీ.. ఎందుకు?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేతతో పాటు.. దేశ ప్రజలు కూడా వణికిపోతున్నారు. ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని కష్టాలకు గురిచేస్తారోనని భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇపుడు అదే ఓ మహిళను చూసి భయపడిపోతున్నారు. ఈ మహిళ గతంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావును వణికించారు. ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీని వణికించేందుకు సిద్ధమయ్యారు. ఆమె పేరు ఇందిరా సాహ్నీ. ఈమెను చూస్తే ప్రధాని మోడీకి ఎందుకు భయం పట్టుకుందో ఓసారి తెలుసుకుందాం. 
 
దేశంలో ఉన్న అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ)లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1992లోనే నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సీనియర్ న్యాయవాది ఇందిరా సాహ్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయపోరాటం చేశారు. అలా నాడు ఈబీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా ఆమె అడ్డుకున్నారు. 
 
ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న 10 ఈబీసీ రిజర్వేషన్లను కూడా అడ్డుకోనున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రధాని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల జనరల్ కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు అవకాశాలను కోల్పోతారని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే ఈ బిల్లును కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఈ బిల్లుపై పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బుధవారం ఆమె వెల్లడించారు. 
 
ఈ బిల్లు వల్ల ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు 59 శాతానికి పెరుగుతాయని ఫలితంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందువల్ల దీన్ని కోర్టు కొట్టివేసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతాన్ని ఆమె ఓసారి గుర్తుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వు చేస్తూ పీవీ తప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments