Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హిజ్రా.. పేరు అప్సరా రెడ్డి

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:04 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ హిజ్రాను (ట్రాన్స్‌జెండర్)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆమె పేరు అప్సరా రెడ్డి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె.. గతంలో అన్నాడీఎంకేకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. అక్కడ నుంచి ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెను పార్టీలో చేర్చుకున్న రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 
 
133 యేళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓ హిజ్రాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇదేతొలిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చేసిన అప్సరారెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐఎంసీ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. బాలలపై లైంగిక దాడులు, తదితర సామాజిక అంశాలపై అప్సరారెడ్డి కృషి చేస్తున్నారు. 
 
భారత జాతీయ కాంగ్రెస్ కుటుంబంలో అప్సరారెడ్డిని సభ్యురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి స్పందిస్తూ అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ శాఖల అధ్యక్షురాళ్లతో కలిసి పని చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం