Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ అంటే యశోదాబెన్‌కు ప్రేమ ఎక్కువ.. పేపర్ కటింగ్స్ సేకరించి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి. నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి సహజసిద్ధంగా మానవ స్పందనలు వుండవన్నారు. మిగిలిన వారికంటే భిన్నంగా వుండాలనే భావన మోదీకి చిన్నప్

Advertiesment
మోదీ అంటే యశోదాబెన్‌కు ప్రేమ ఎక్కువ.. పేపర్ కటింగ్స్ సేకరించి?
, సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి. నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి సహజసిద్ధంగా మానవ స్పందనలు వుండవన్నారు. మిగిలిన వారికంటే భిన్నంగా వుండాలనే భావన మోదీకి చిన్నప్పటి నుంచి వుందంటూ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్‌లో పనిచేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారని తెలిపారు. 
 
అందుకే తల్లి, అన్నయ్య, సోదరి, భార్య ఎవరిపైనా మోదీకి ప్రేమ లేదు. తల్లిని కూడా పుట్టినరోజు నాడే మోదీ కలుస్తారు. అయితే మోదీ అంటే యశోదాబెన్‌కు ఎనలేని ప్రేమ. మోదీ పేపర్ కటింగ్స్ అన్నీ సేకరించి ఆమె దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా మోదీకి స్నేహితులెవ్వరూ లేరు. సన్నిహితులైన వాఘేలా, తొగాడియాను కూడా మోదీ దూరం చేసుకున్నారు. 
 
ఇతరుల లోపాలను గుర్తించడం వరకే మోదీ చేయగలరు. మోదీ తన బంధువులను కుటుంబీకులను ఏమాత్రం పట్టించుకోరు.  హిందూమతం పట్ల మోదీకి ఎటువంటి ప్రేమలేదు.. ఆ మతాన్ని వాడుకుంటున్నారని సి నరసింహారావు తెలిపారు. 
 
అహ్మదాబాద్‌లో వంద ఆలయాలను ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకే ప్రవీణ్ తొగాడియాను ఆయన జైలులో పెట్టించారని గుర్తు చేశారు. మోదీ పరిజ్ఞానం లేదని.. మోదీ మంత్రివర్గంలో సమర్థులు లేరని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రమే ఆయనకు చక్కని అనుచరుడని సి నరసింహారావు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరి చిచ్చు : అట్టుడుకుతున్న తమిళనాడు.. 5న రాష్ట్ర బంద్