Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోటల్‌లో విచ్చలవిడిగా ఎంజాయ్... చాందినీ జైన్ కేసులో షాకింగ్ విషయాలు

హైదరాబాద్‌లోని మియాపూర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వివిధ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 52 మంది విద్యార్థినీ విద్యార్థులు లక్డీకపూల్

Advertiesment
Chandni Jain Murder Case
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:03 IST)
హైదరాబాద్‌లోని మియాపూర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వివిధ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 52 మంది విద్యార్థినీ విద్యార్థులు లక్డీకపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో మూడు రోజులు గదులు తీసుకుని ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో చాందినీ జైన్ కూడా ఉన్నట్టు వినికిడి . 
 
'నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్' అనే వెబ్ పేజీని ప్రారంభించుకున్న వీరు హైదరాబాద్, బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలల్లో చదువుతున్న వారని, వీరంతా ఈ నెల 1 నుంచి 3 వరకూ 23 గదులను బుక్ చేసుకుని విచ్చలవిడిగా గడిపారని పోలీసులు తేల్చారు. వీరంతా మైనర్లు అయినప్పటికీ, హోటల్ యాజమాన్యం ఇవేమీ పట్టించుకోకుండా వారికి మద్యం సరఫరా చేసిందట. వారిలో చాందినీ జైన్ కూడా ఉందని, హోటల్‌కు వచ్చిన వారిలో చాలా మంది ఇళ్లల్లో అబద్ధాలు చెప్పి వచ్చిన మైనర్లేనని వెల్లడించారు. 
 
ఈ సదస్సులో సోహెల్ అనే విద్యార్థి చాందినీ జైన్‌కు పరిచయం కావడం, వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడంతోనే సాయికిరణ్ రెడ్డికి ఆగ్రహం తెప్పించి ఉండవచ్చని, అదే హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. ఇక చాందినీని హత్య చేసిన సాయికిరణ్ మైనర్ కావడంతో, జువైనల్ చట్టాల మేరకే విచారణ ఉంటుందని పోలీసులు సూచన ప్రాయంగా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంచం కేసులో అరెస్టు అయ్యానన్న ఆవేదనతో చితి పేర్చుకునీ...