Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (12:11 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరాన్ని భిక్షగాళ్లు (యాచకులు) లేని నగరంగా తీర్చి దిద్దేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొన్ని కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా కొన్ని ఆంక్షలను కూడా అమలు చేస్తుంది. ముఖ్యంగా యాచకులకు భిక్షం వేసేవారిపై కఠిన చర్యలు చేపట్టింది. యాచకులకు భిక్షం వేసినందుకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్‌లోని సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ.. 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ పది నగరాల్లో ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. 
 
ఇందులోభాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇండోర్ అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది.
 
మరోవైపు, దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను వరుసగా కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో పరిశుభ్రతలోనేకాకుండా యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భిక్షాటన చేస్తున్న వారికి ఎలాంటి సాయం చేయొద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అక్కడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం