Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

Advertiesment
fire accident

ఠాగూర్

, బుధవారం, 22 జనవరి 2025 (12:16 IST)
టర్కీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 76 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అనేక మంది హోటల్ భవనంపై నుంచి కిందకు దిగేశారు. పాఠశాలలకు శీతాకాల సమావేశాలు కావడంతో ఆ దేశంలోని హోటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నారు. ఈ ప్రమాద సమయంలో 238 మంది ఉన్నారు. ఈ ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరని టర్కీ మంత్రి ఒకరు హెచ్చరించారు.
 
వాయవ్య టర్కీలోని పాప్యులర్ స్కీ రిసార్టులోని హోటల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బోలు ప్రావిన్స్ కొరొగ్లు పర్వత ప్రాంతాల్లోని కర్తల్కయ వద్దనున్న రిసార్టులోని గ్రాండ్ కర్తాల్ హోటల్లో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. స్కూళ్లకు శీతాకాల సెలవులు కావడంతో పర్యాటకులతో హోటళ్లు కిక్కిరిసిపోయాయి. పై అంతస్తుల్లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడిందని, కొందరు దుప్పట్లు ఉపయోగించి కిందికి దిగేందుకు ప్రయత్నించారని హోటల్ మూడో అంతస్తులో ఉన్న పర్యాటకుడు యెల్కోవన్ తెలిపారు. 
 
ఇప్పటివరకు చనిపోయిన 76 మందిని గుర్తించామని, 45 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్లో 238 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదం సంభవిస్తే 4.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉందని తుర్కియే అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి అలీ యెర్లికయే తెలిపారు. ఈ ఘటనతో తమ హృదయాలు బద్దలయ్యాయని, ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు: షాక్‌లో మధ్యతరగతి, పేద కుటుంబాలు