Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే గదిలో ప్రియుడు - ప్రియురాలు : గుర్తించలేకపోయిన తల్లిదండ్రులు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:57 IST)
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ప్రియుడు, ప్రియురాలు కలిసి ఒకే గదిలో ఉన్నారు. కొన్ని నెలల పాటు ఆ గదిలోనే ఉన్నారు. కానీ, అబ్బాయి తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఇక్కడ విచిత్రమేమిటంటే యువతి ఇల్లు కూడా పొరుగిల్లే. ఆ యువతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. చివరకు తమ కుమారుడు కనిపించడం లేదని అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... ఆ ప్రేమ జంటను గుర్తించారు. వారు చెప్పిన విషయం విని షాక్‌కు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్‌కు చెందిన ఓ యువతి పదేళ్ళ క్రితం తన ప్రియుడితో కలిసి లేచిపోయింది. ఆ యువతి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఆశలు వదిలేసుకున్నారు. 
 
ఈ క్రమంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ అమ్మాయి దొరికింది’ అని చెప్పారు. తీరా వెళ్లే సరికి ఆ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. అతడ్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అతడు తమ పక్కింటి కుర్రాడే. ఆ అమ్మాయి మరెక్కడికో లేచిపోలేదు! పక్కింటికే వెళ్లింది. 
 
ఇన్ని సంవత్సరాలు అక్కడే గడిపింది. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. ఆ అబ్బాయి.. తన పక్కింటి ప్రియురాలిని.. ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో.. తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే.. లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. 
 
అయితే, ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట!  మూడు నెలల క్రితం ఆ అబ్బాయి.. గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేసేవాళ్లు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments