Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహల్‌ను దేశ ద్రోహులు నిర్మించారా? ఎర్రకోటపై మోదీ జెండా ఎగురవేయడాన్ని ఆపేస్తారా?

ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ కూడా ప్రస్తుతం వివాదానికి నిలయంగా మారింది. యూపీ పర్యాటక శాఖ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రోత్సాహానికి విడుదల చేసిన బుక్‌లెట్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (16:02 IST)
ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ కూడా ప్రస్తుతం వివాదానికి నిలయంగా మారింది. యూపీ పర్యాటక శాఖ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రోత్సాహానికి విడుదల చేసిన బుక్‌లెట్‌లో తాజ్ మహల్ పేరును తొలగించింది. యూపీ సర్కారు విడుదల చేసిన పర్యాటక ప్రదేశాల జాబితాలో తాజ్ మహల్ లేకపోవడంపై.. విపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
మత ప్రాతిపదికన తాజ్‌మహల్‌ను ప్రభుత్వం చూస్తోందంటూ యూపీ విపక్షాలు విమర్శలతో దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో తాజ్ మహల్‌పై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిపిందే. దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం తాజ్ మహల్ అన్నారు. తాజ్‌ను నిర్మించిన షాజహాన్ తన తండ్రినే నిర్బంధించాడని సంగీత్ కామెంట్ చేశారు. హిందువులను తుడిచిపెట్టేయాలనుకున్నాడని విమర్శలు గుప్పించారు. 
 
ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ కట్టడాలన్నీ దేశద్రోహులు కట్టించినవైతే.. ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని ప్రధాని మోదీ ఆపేస్తారా? అని ఓవైసీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ఉగ్రవాదం తదితర సమస్యలెన్నో ఉండగా.. వాటిని పరిష్కరించుకోకుండా.. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనవసర అంశాలను వివాదాస్పదం చేస్తున్నారంటూ అసదుద్ధీన్ ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments