తాజ్‌మహల్‌లోని మిస్టరీలు.. ముంతాజ్ మరణించాక షాజహాన్ ఆమె సోదరిని?
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా పరిగణించబడుతోంది. మొఘల్ సామ్రాజ్యాధినేత షాజహాన్ తాజ్ మహల్‌ను తన భార్యపై ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్‌పై ఇప్పటికీ
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా పరిగణించబడుతోంది. మొఘల్ సామ్రాజ్యాధినేత షాజహాన్ తాజ్ మహల్‌ను తన భార్యపై ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ తాజ్‌మహల్‌పై ఇప్పటికీ కొన్ని వీడని మిస్టరీలున్నాయి. అవేంటో తెలుసా? చదవండి మరి. తాజ్ మహల్ హిందూ ఆలయంగా ఉన్నదని, దాన్ని షాజహాన్ తాజ్ మహల్‌గా మార్చినట్లు సమాచారం.
షాజహాన్ ఏడుసార్లు వివాహం చేసుకున్నాడు. ఈ ఏడుగురిలో నాలుగో సతీమణి పేరే ముంతాజ్. ముంతాజ్ వేరే వ్యక్తిని వివాహం చేసుకోగా, ఆమె ప్రేమలో పడి షాజహాన్ ఆమెను మనువాడేందుకు.. ఆమె భర్తను హత్య చేశారట. ముంతాజ్ 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించినట్లు చరిత్ర చెప్తోంది. ముంతాజ్ మరణించిన పిమ్మట షాజహాన్ ఆమె సోదరిని పెళ్లాడినట్లు టాక్. అలాగే షాజహాన్ అంత్యక్రియలు ఎప్పుడు జరిగింది. ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు.
తాజ్ మహల్‌లో 99 అల్లా పేర్లు అద్భుతంగా లిఖించబడ్డాయి. సూర్యోదయం సమయంలో తాజ్ మహల్ తన రంగును మార్చుకుంటుంది. రకరకాల రంగులతో దర్శనమిస్తుంది. ఈ రంగులను మహిళల మనసత్త్వానికి ప్రతీకగా చెప్తున్నారు. సూర్యోదయం పూట లేత రోజాపూవులాంటి రంగులో కనిపించే తాజ్ మహల్.. సాయంత్రానికి పాలరంగుకు మారిపోతుందట.
17 సంవత్సరాల పాటు 22వేల కార్మికులు 32 మిలియన్ల భారతీయ నగదు, 1000 ఏనుగులతో తాజ్ మహల్ నిర్మాణం జరిగింది. తాజ్‌మహల్ చుట్టూ గల నాలుగు స్థూపాలు భూకంపం నుంచి భవనాన్ని రక్షిస్తాయట. తాజ్ మహల్‌లో సొరంగాలు ఉన్నాయట. శివుని ఆలయాన్నే తాజ్‌మహల్‌గా మార్చారని చెప్తారు. తాజ్ మహల్‌లో 1089 గదులు వుండేవట. ఈ గదుల సీలింగ్‌కు హిందూ డిజైన్లుండేవట.