Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తర్వాత పాకిస్థాన్‌లో విషాద ఛాయలు: విజయ్ రూపానీ

Vijay Rupani
Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:38 IST)
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు, అభ్యర్థుల మధ్య విమర్శల తూటాలై పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందించడం ఈరోజు కొత్తేమీ కాదు. తాజాగా భాజపా నేత, గుజారాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 
 
ఈసారి ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో దీపావళి జరుపుకొంటారని వ్యాఖ్యానించారు. "కానీ ఇది జరగకపోవచ్చు, దేశ ప్రజలు మాత్రం మళ్లీ నరేంద్ర మోడీకే పట్టం కడతారు. దీంతో పాకిస్థాన్‌లో విషాద ఛాయలు అలముకుంటాయి’’ అని ‘విజయ్‌ సంకల్ప్‌’ ర్యాలీలో రూపానీ అన్నారు. 
 
కాంగ్రెస్‌‌లో చాలా మంది అక్కడి వారికి మద్దతిస్తున్నారు అని చెప్పారు. ఇటీవల బాలాకోట్‌ దాడులపై రాహుల్‌ గాంధీ సలహాదారుడు శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని రూపానీ తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా తెలుసు కానీ పాకిస్తాన్‌ని తప్పుబట్టడం పిట్రోడాకు ఎందుకు నచ్చలేదని వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్ నాయకులంతా పాకిస్థాన్‌ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్వయంగా సైనికాధికారులు చేసిన ప్రకటనలను ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించారు. రామరాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్న మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ!

Dr. Mohanbabu: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతం విడుదల

Balakrishna: బాలకృష్ణ నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్

Sushanth: రెండు డిఫరెంట్ లుక్‌లలో సుశాంత్ అనుమోలు కొత్త సినిమా పోస్టర్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments