Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిడిల్ స్టంప్ కింద పడింది.. కానీ బెయిల్స్ చెక్కు చెదర్లేదు.. ఔటా.. నాటౌటా?

మిడిల్ స్టంప్ కింద పడింది.. కానీ బెయిల్స్ చెక్కు చెదర్లేదు.. ఔటా.. నాటౌటా?
, సోమవారం, 25 మార్చి 2019 (18:15 IST)
సాధారణంగా క్రికెట్ ఆటలో స్టంప్ లేదా బెయిల్స్ కింద పడితే బ్యాట్స్‌మెన్ ఔట్ అయినట్టు లెక్క. అదే మిడిల్ స్టంప్ కిందపడి.. బెయిల్స్ మాత్రం చెక్కుచదరకుండా అలానే ఉండిపోతే.. ఆ బ్యాట్స్‌మెన్ ఔటా, నాటౌటా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. 
 
అయితే, పైన ఫోటో చూశారు కదా. మిడిల్ స్టంప్ మాత్రం కిందపడిపోయింది. కానీ పైనున్న బెయిల్స్ మాత్రం చెక్కు చెదరలేదు. మరి క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ఔటా.. నాటౌటా.. అసలు క్రికెట్ నిబంధనలను రూపొందించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలే (ఐసీసీ) సాధారణ అభిమానులను ఈ ప్రశ్న అడగటం విశేషం. 
 
ఇటీవల పాకిస్థాన్‌ దేశంలో కొందరు కుర్రోళ్ళు గల్లీ క్రికెట్ ఆడుతుంటే ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆ వెంటనే పిల్లలు ఫొటో తీసి నేరుగా ఐసీసీకి ట్వీట్ చేశారు. మీరే న్యాయం చెప్పాలంటూ అడిగారు. సరే.. అన్ని రూల్స్ తెలిసిన ఐసీసీయే ఇది ఔటో నాటౌటో చెప్పేయొచ్చు. కానీ సరదాగా ఇదే ఫొటోను ట్వీట్ చేస్తూ ఔటా కాదా చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నించింది. 
 
దీనికి ఒక్కో నెటిజన్ ఒక్కో విధంగా సమాధానం చెప్పాడు. చాలా మంది నెటిజన్లు మాత్రం నాటౌట్ అంటూ సమాధానమిచ్చారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం బెయిల్స్ కింద పడాలి కదా. మిడిల్ స్టంప్ కింద పడినా.. పైనున్న బెయిల్ చెక్కు చెదరలేదు కాబట్టి.. ఇది నాటౌటే అని తేల్చారు. 
 
కానీ ఐసీసీ మాత్రం దీనిని ఔట్ అని తేల్చింది. ఐసీసీ రూల్ బుక్‌లోని 29.1.1 ప్రకారం ఇది ఔట్. ఎందుకంటే ఈ నిబంధన ప్రకారం బెయిల్ కింద పడాలి లేదా స్టంప్ పూర్తిగా నేలకొరగాలి. అలా జరిగితే బ్యాట్స్‌మన్ ఔటే. ఈ నిబంధనను చెబుతూ సదరు బ్యాట్స్‌మన్ ఔటే అని తేల్చింది. మొత్తానికి గల్లీ క్రికెట్ అయినా కూడా ఈ ఫొటో కారణంగా అభిమానులకు ఓ కొత్త నిబంధన తెలిసి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరి కళ్లూ అతడి వైపే.. ఎవరతను?