Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్న ఇండియన్ ఎయిర్ చీఫ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:24 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అనే కొండ అటవీ ప్రాంతంలో భారత రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రాంతాన్ని భారత్ వైమానికదళ అధిపతి వీఆర్ చౌదరి సందర్శించనున్నారు. అలాగే, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నీలగిరికి రానున్నారు. వీరిద్దరూ కన్నూరులోని సూళూరు ఎయిర్ బేస్ కేంద్రాన్ని సందర్శిస్తారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వివరాలు తెలియాల్సివుంది. ఈ హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిలో మధులిక రావత్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు.
 
ఇదిలావుంటే అస్సలు బిపిన్ రావత్ కన్నూరుకు ఎందుకు వెళ్లారో పరిశీలిస్తే, కన్నూరుకు సమీపంలో ఉన్న వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ కేంద్రంలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన హాజరై కీలక ప్రసంగం చేయాల్సివుంది. ఈ కేంద్రంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. 
 
కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన ఈ హెలికాఫ్టర్ కాట్టేరి వద్ద కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రమాదమా? లేక విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments