మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం చెలరేగింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏకంగా 8కి చేరింది.
మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతన్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదైంది. బెంగుళూరులో 2, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో తొలి నమోదు కేసు ఆదివారం నమోదైంది. టాంజానియా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కేసు నమోదైంది. అలాగే, ఢిల్లీలో మరో 15 మంది ఒమిక్రాన్ అనుమానితులను ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో నమోదైన కేసు దుబాయ్ నుంచి వచ్చిన టాంజానియా దేశస్థుడిలో వెలుగుచూసింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 154 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 30979 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 154 కేసులు గుర్తించారు. ఈ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 30, విశాఖలో 20 కేసులు చొప్పున అత్యధికంగా నమోదయ్యాయి.