దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా టాంజానియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిని ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే, ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని లోక్‌నారాయణ జయప్రకాష్ ఆస్పత్రిలో చేర్చి, వారిపై నిఘా ఉంచారు.
మరోవైపు, ఆదివారం సౌదీ అరేబియా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఆరేబియా విమానంలోని 95 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. కాగా, దేశంలో ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెల్సిందే.