Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫామ్‌హౌస్‌లో భర్తను కట్టేసి.. భార్యపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:33 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మహేశ్వరంలో భర్త కళ్లెదుటే భార్యపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్లతండాకు చెందిన చందు భార్యాపిల్లలతో కలిసి మహేశ్వరం మండలంలోని హర్షగూడలో నివసిస్తూ స్థానికంగా ఉండే ఓ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన ఫాంహౌస్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌ రెడ్డిలతో గొడవ పడ్డాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో చందు, అతడి భార్యను వారు ఫాంహౌస్‌లో బంధించారు. అనంతరం చందు భార్యను మరో గదిలోకి తీసుకెళ్లి రంగారెడ్డి, ప్రతాప్‌ రెడ్డితోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments