Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ...

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:25 IST)
ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ భర్తకు కట్టుకున్న భార్య అన్నంలో విషం కలిపిపెట్టి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలంలోని మూడు గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్ (30), పావని అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీను అనే యువకుడుతో పావని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని మందలించారు.
 
దీంతో భర్తపై కక్ష పెంచుకున్న పావని.. ప్రియుడు శ్రీనుతో కలిసి భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. అందులోభాగంగా బుధవారం మధ్యాహ్నం విషం కలిపిన ఆహారాన్ని అతడికి అందించింది. అది తిన్న మోహన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
గమనించిన మోహన్ తల్లి హేమ్లీ, గ్రామస్థుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మోహన్ తల్లి ఫిర్యాదుపై గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments