Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ముస్లింలకు చిత్రహింసలు... పాక్‌ను నిలదీసిన అమెరికా

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:26 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ముస్లింల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఓ సూటి ప్రశ్న సంధించింది. భారత్‌ సంగతి సరే.. చైనాలో ముస్లింలు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ వారి సంగతి ఏంటంటూ నిలదీశారు. 
 
ఇదే అంశంపై అమెరికా దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల శాఖ తాత్కాలిక సహాయ మంత్రి అలిస్‌ వేల్స్‌ మీడియాతో మాట్లాడుతూ చైనాలోని జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉయ్‌గుర్‌ ముస్లింలను నిర్బంధంలో ఉంచినా ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. 
 
'కాశ్మీర్‌లో మాదిరిగానే పశ్చిమ చైనాలో నిర్బంధంలో మగ్గుతున్న ముస్లింల మానవహక్కులపట్ల నేను ఆందోళన చెందుతున్నా. చైనా అంతటా ముస్లింలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులను మీరు వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నా' అని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి ఆమె అన్నారు. 
 
మరోవైపు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలిగించిన తర్వాత కాశ్మీర్ లోయలో విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు భారత ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ లోయలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక రూపొందించారన్నారు. కాశ్మీరీలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే చర్యలను అమెరికా స్వాగతిస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments