Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ - గులాం నబీ ఆజాద్ రిజైన్

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (12:41 IST)
కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా గుడ్‌బై చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. పనిలోపనిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతి తగిన మెచ్యూరిటీ లేదంటూ సుతిమెత్తని విమర్శలు గుప్పించారు. 
 
కాగా, సోనియాకు రాసిన లేఖలో తాను 1970 నుంచి పార్టీలో కొనసాగుతున్నానని, అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ కోసమే పని చేశానని తెలిపారు. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రిమోట్ కంట్రోల్‌ మోడల్‌తో పని చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పార్టీ పరిస్థితి నానాటికీ దిగిజారిపోతున్నా.. సరైన సర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శించారు. పైగా, భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి సరైన మెచ్యూరిటీ లేదని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని గత 2020లో పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన 20 మంది పార్టీ సీనియర్ నేతల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఒకరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments