Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం

Webdunia
బుధవారం, 21 జులై 2021 (15:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. దీంతో 89 యేళ్ళ కళ్యాణ్ సింగ్‌కు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కళ్యాణ్‌ సింగ్‌కు మంగళవారం సాయంత్రం నుంచి ఆయ‌న‌ను లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచామ‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య ప‌రిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయన ల‌క్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇటీవ‌లే ఆసుప‌త్రికి వెళ్లిన ప‌లువురు నేత‌లు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క‌ల్యాణ్ సింగ్‌కు హృద్రోగ‌, న‌రాల వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు.
 
కాగా, కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన వెంటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్పత్రికి వెళ్లి కళ్యాణ్‌ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments