'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (18:22 IST)
కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) హత్య కేసులో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతిని బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం పల్లవి తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసి నేను రాక్షసుడుని చంపేశాను అని చెప్పినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పల్లివితో పాటు వారి కుమార్తె కృతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 
ఓం ప్రకాష్‌ను కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు తేలింది. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్, పల్లవి దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అవి తీవ్రరూపం దాల్చడంతో ఆయనపై పల్లవి కారప్పొడి చల్లి... కాళ్లు చేతులు తాడుతో కట్టేసింది. ఆ తర్వాత కత్తితో కసితీరా పొడిచి చంపేసింది. ఈ హత్య కోసం ఆమె ఒక గ్లాస్ బాటిల్‌ను కూడా ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారు. తన భర్తను తానే చంపేసినట్టు చెప్పారు. దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది. 
 
మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్! 
 
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పదమృతి వెనుకు ఉన్న మిస్టరీ వీడిపోయింది. ఆయన భార్యే హంతకురాలని తేలిపోయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పైగా, ఈ హత్య కేసులో మాజీ డీజీపీ కుమార్తె హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
 
కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపులోనూ తన భర్త ప్రకాశ్.. తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్‌లు పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈ క్రమంలో ఆదివారం మరోమారు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్రరూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి 'ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్' అంటూ ఫోనులో మెసేజ్ పెట్టింది. డీజీపీ అలోక్ మోహన్, బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments