Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Advertiesment
om prakash

ఠాగూర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (12:11 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) కట్టుకున్న భార్య పల్లవి చేతిలోనే దారుణ హత్యకు గురైనట్టు తేలిపోయింది. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు తేలింది. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్, పల్లవి దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అవి తీవ్రరూపం దాల్చడంతో ఆయనపై పల్లవి కారప్పొడి చల్లి... కాళ్లు చేతులు తాడుతో కట్టేసింది. ఆ తర్వాత కత్తితో కసితీరా పొడిచి చంపేసింది. ఈ హత్య కోసం ఆమె ఒక గ్లాస్ బాటిల్‌ను కూడా ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారు. తన భర్తను తానే చంపేసినట్టు చెప్పారు. దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది. 
 
మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్! 
 
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పదమృతి వెనుకు ఉన్న మిస్టరీ వీడిపోయింది. ఆయన భార్యే హంతకురాలని తేలిపోయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పైగా, ఈ హత్య కేసులో మాజీ డీజీపీ కుమార్తె హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
 
కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపులోనూ తన భర్త ప్రకాశ్.. తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్‌లు పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈ క్రమంలో ఆదివారం మరోమారు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్రరూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి 'ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్' అంటూ ఫోనులో మెసేజ్ పెట్టింది. డీజీపీ అలోక్ మోహన్, బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ