Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

Advertiesment
Drunk woman

ఐవీఆర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (18:02 IST)
పూటుగా మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తూగుతూ తిరిగే మగవాళ్లను చూస్తుంటాం. కానీ మద్యం సేవించి రోడ్లపై వీరిలా తిరిగే ఆడవాళ్లను చూసి వుండము. ఐతే హరిద్వార్‌లో ఓ మహిళ పూటుగా మద్యం సేవించి బిజీ రోడ్డుపై వాహనాలను అడ్డుకుంటూ హంగామా సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
xలో పోస్టు చేసిన వీడియోలో... రోడ్డు మధ్యలో ఓ మహిళ కార్లను ఆపుతూ అసౌకర్యాన్ని కల్గిస్తోంది. ఓ ఆటోలోకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చోబోయింది. అతి కష్టం మీద అతడు కిందకు దించడంతో అక్కడి నుంచి రోడ్డు మధ్యలో నడుస్తూ వాహనాలకు అంతరాయం కలిగించింది. చివరికి ట్రాఫిక్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు