Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Advertiesment
ts inter board

ఠాగూర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (17:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరైన ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరువుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబరును ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తలేని జీవితం.. ఇక జీవించడం కష్టం.. నదిలో బిడ్డల్ని పారవేసింది.. ఆపై ఆమె కూడా?