Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

Advertiesment
nta test

ఠాగూర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (17:59 IST)
జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్షల తుది కీ (JEE Mail 2025 Session 2 Final Key) మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్-1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే తొలగించింది. 
 
ఇందుకు కారణం ఏమిటో తెలుపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఎన్టీఆర్ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్టు పేర్కొంది. 
 
మరోవైపు, జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయాల్సిన ఉన్నప్పటికీ, నిర్ణీత గడువులోగా రిజల్ట్స్ ఇవ్వడంలోనూ ఎన్టీఏ విఫలమైందంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం స్పందించిన ఎన్టీఏ శనివారం లోపే ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి స్నేహితులతో కలిసి భర్తను చంపేసి.. లవర్‌కు వీడియో కాల్ చేసి డెడ్‌బాడీని చూపిన భార్య!