Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

Advertiesment
reel on road

ఠాగూర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (10:48 IST)
అనేక మంది యువతులు రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు యువత చేసే పనులు ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా బెంగూళురుకు చెందిన ఓ యువకుడు వెర్రి చేష్టలకు పోలీసులు తిక్క కుదిర్చారు. రీల్స్ మోజులో పడి పిచ్చివేషాలు వేయడంతో అరెస్టు చేసి జైల్లో పడేశారు. 
 
బెంగుళూరు - మాగడిలో రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ సేవిస్తూ ఆ యువకుడు రీల్స్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి ఆ రీల్స్ చేసిన యువకుడుని అరెస్టు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)