ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (13:51 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ, రేఖా గుప్తాకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మొహరించారు.
 
జడ్ కేటగిర్ భద్రతతో 20 మందితో పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్‌ వాహనానలు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. కాగా, బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ దాడి ఘటన జరిగిన విషయం తెల్సిందే. తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినట్టు నటించిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

Ankit Koyya: బ్యూటీ ప్రతీ ఇంట్లో, ప్రతీ వీధిలో జరిగే కథ : అంకిత్ కొయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments