Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

Advertiesment
Nagarjuna - NTR

దేవీ

, బుధవారం, 13 ఆగస్టు 2025 (12:10 IST)
Nagarjuna - NTR
ఆగస్టు 14వ తేదీన రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదలకాబోతున్నాయి. రజనీకాంత్ నటించిన కూలీ మాత్రుక తమిళం. అదేవిధంగా హిందీలో నిర్మించిన వార్ 2 మాత్రుక బాలీవుడ్. రెండింటిలోనూ తెలుగు అగ్ర నటులు వుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కూలీ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా పవర్ ఫుల్ రోల్ నాగార్జునది. విలన్ గా చేస్తున్నాడు. రజనీకాంత్ కూడా తనకు విలన్ అంటే ఇష్టమనీ, అనుకోకుండా హీరో అయ్యాయని కూడా వీడియోలో పేర్కొన్నాడు. 
 
ఇక అదేవిధంగా వార్ 2లో హీరో హ్రుతిక్ రోషన్ అయితే ప్రతినాయకుడిగా ఎన్.టి.ఆర్. నటించాడు. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందనీ, ఆర్.ఆర్.ఆర్. సినిమా చూశాక ఆదిత్య చోప్రా తీసుకున్న నిర్ణయమని తెలియజేస్తున్నారు. మరి ఎవరికి వారు తమ సినిమా పట్ల నమ్మకంతో వున్నారు. ఇప్పటికే రెండు సినిమా టికెట్లు బుక్ అయ్యిపోయాయి. 
 
సహజంగా కొన్ని సార్లు తెలుగు ప్రమోషన్ కు రజనీకాంత్ వచ్చేశాడు. కానీ ఈసారి అంతకుముందు కూడా ఆయన ప్రమోషన్ కు రాలేదు. ఒకవేళ తెలుగువారిపై ఆయనకున్న నమ్మకమో, రాకపోయినా నా వీడియో ద్వారా సందేశం అందరికీ చేరుతుందనే నమ్మకమో కానీ ఆయనా ధీమగా వుండి ప్రమోసన్ అంతా నాగార్జున పై వదిలేశాడు.
 
ఇక బాలీవుడ్ సినిమాలు తెలుగులో విడుదలయితే షారూఖ్ ఖాన్ కానీ, సన్నీడియోల్ కానీ, రుతిక్ రోషన్ కానీ అంతకుముందు హీరోలుకూడా తెలుగు ప్రేక్షకులను పలుకరించేవారు. హ్రుతిక్ తొలిసారి కాబట్టి ఎంట్రీ సినిమా కనుక ఆయన వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను థియేటర్ కు రండి అంటూ వేడుకున్నాడు.
 
తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, నాగార్జున ఎప్పుడూ పూర్తి స్థాయి ప్రతికూల పాత్రను పోషించలేదు మరియు అతని అభిమానులు, సాధారణ ప్రేక్షకులతో పాటు, కూలీలో "సైమన్" పాత్రను అతను ఎలా పోషించాడో చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. లోకేష్ ఈ పాత్రకు నాగ్‌ను మాత్రమే కోరుకున్నారు మరియు రజనీకాంత్ కూడా కూలీలో దేవా కంటే సైమన్ పాత్రను పోషించాలనుకుంటున్నట్లు ఒక వీడియోలో పేర్కొన్నారు. ఇంత హైప్ ఉన్న నేపథ్యంలో, నాగార్జున ఈ పాత్రను ఎలా పోషిస్తాడనేది తెలుగు సినీ ప్రేమికులు కూలీలో అత్యంత ఎదురుచూస్తున్న అంశం.
 
తన రెండు దశాబ్దాల కెరీర్‌లో తొలిసారిగా, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, నిర్మాత ఆదిత్య చోప్రా తనను నమ్మమని కోరాడని, తన అభిమానులను గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చాడని నటుడు వెల్లడించాడు. ఈ విషయం తన అభిమానులను మరింత ఉత్సాహపరిచింది మరియు తారక్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించడం సరైన నిర్ణయమని వారు నమ్ముతున్నారు. హృతిక్ రోషన్ సరసన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అంత తేలికైన పని కాదు, తారక్ దానిని ఎలా సాధించడంలో విజయం సాధించాడో రేపు తెలుస్తుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు మరియు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన "డబుల్ కాలర్" క్షణం వారిని రిలాక్స్ చేసి రాబోయే తుఫాను కోసం వేచి ఉండేలా చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?