Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

Advertiesment
Manchu Manoj  David Reddy

దేవీ

, బుధవారం, 6 ఆగస్టు 2025 (14:39 IST)
Manchu Manoj David Reddy
మనోజ్ మంచు తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. తన తాజా ప్రాజెక్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. హిస్టరీ, రెబెలియన్‌తో కూడిన ఈ చిత్రం తెలుగు సినిమాకి ఓ మైల్ స్టోన్ కానుంది. 
 
 డేవిడ్ రెడ్డి అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కథ 1897 నుంచి 1922 వరకూ నడుస్తుంది. ఈ స్టోరీలో మనోజ్ ఎన్నడూ చూడని పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇది. కథ రా, గ్రౌండెడ్, ఎమోషనల్ మాస్ టచ్‌ తో జనం గుండెల్లో నిలిచిపోయేలా వుంటుంది. 
 
21 సంవత్సరాల క్రితం, ఇదే రోజున మంచు మనోజ్ దొంగ దొంగదితో అరంగేట్రం చేశారు. ఇప్పుడు, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, తన న్యూ బ్లాస్టింగ్ వెంచర్ డేవిడ్ రెడ్డిని ప్రకటించడం విశేషం. సినిమా ప్రేమికులకి ఇది మరిచిపోలేని మెమొరబుల్ మూమెంట్.
 
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. తెరపై చూపించే విప్లవానికి టోన్‌ను సెట్ చేస్తుంది. టైటిల్ డిజైన్‌ని మనోజ్ ఫేస్‌లోకి మార్చడం చాలా క్రియేటివ్ గా వుంది. "మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!" అనే ట్యాగ్‌లైన్‌ కట్టిపడేసింది. విజువల్ గా అద్భుతమైన పోస్టర్ సినిమా ఎంత పవర్‌ ఫుల్ గా వుంటుందో తెలియజేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి