Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం.. ఆపై తాళి కట్టి కాపురం చేయాలంటూ ఒత్తిడి

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:23 IST)
తన కుమారుడు ప్రేమించిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా తాళికట్టి.. తనతో కాపురం చేయాలంటూ చిత్ర హింసలకు గురిచేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్ణణం జిల్లా వేదారణ్యం సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వేదారణ్యం సమీపంలోని సెంబోడై అనే గ్రామానికి చెందిన ముఖేశ్ కన్నన్ (20) అనే యువకుడు ఐటీఐ చదువుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి, తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. అయితే, ఈ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు సమ్మతించలేదు. అలాగే, ముఖేశ్ కన్నన్ తండ్రి నిత్యానందన్ (42) కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, ముఖేశ్ కన్నన్ మాత్రం ఈ పెళ్లి జరిపించి తీరాల్సిందేనని, లేనిపక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని బెదిరించాడు. దీంతో నిత్యానందన్ ఈ పెళ్లిని ఎలాగైనా అపించాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
తన ప్లానులో భాగంగా ఆ యువతి ఇంటికెళ్లిన నిత్యానందన్... తన కుమారుడితో పెళ్లి జరిపిస్తానని నమ్మించి తనతో రావాలంటూ విజ్ఞప్తి చేశాడు. అతని మాటలను నమ్మిన యువతి... అతనితో కలిసి బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో జనసంచారం లేని ప్రాంతంలో ఆ యువతిపై నిత్యానందన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెకు బలవంతంగా తాళికట్టి, పిమ్మట ఆ యువతిని తీసుకెళ్లి అవరిక్కాడులోని తన స్నేహితుడు శక్తివేలు ఇంట్లో నిర్బంధించాడు. 
 
ఇకపై తనతోనే కాపురం చేయాలని లేనిపక్షంలో చంపేస్తానంటూ బెదిరించసాగాడు. అదేసమయంలో తన కుమారుడిని పిలిచి.. ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకోబోతుందని నమ్మించాడు. ఇంతలో శక్తివేల్ ఇంట్లో నిర్బంధంలో ఉన్న ఆ యువతి తప్పించుకుని వేదారణ్యం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments