ఇంట్లో ఒంటరిగా వున్న యువతి.. గట్టిగా అరుపులు.. పెళ్లైన 8 నెలల్లోనే?

బుధవారం, 29 జనవరి 2020 (15:11 IST)
తమిళనాడు నాగర్‌కోయిల్ సమీపంలో పెళ్లై ఎనిమిదో నెలలో ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కోయిల్ కాట్రాడితట్టు ప్రాంతానికి చెందిన శివన్ (28) భార్య అర్చన (24). ఈమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగింది. మేనమామ చేతుల మీదుగానే అర్చనకు శివన్‌తో వివాహం జరిగింది. 
 
అయితే అర్చనకు, శివన్‌కు మధ్య పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరిగేవి. సోమవారం కూడా వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. మంగళవారం అలా శివన్ ఉద్యోగానికి వెళ్లడంతో.. అతని ఇంట ఉన్నట్టుండి పెద్దగా అరుపులు శబ్ధం వినబడింది. వెంటనే ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసేలోపు.. అర్చన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 
కానీ అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు అర్చన మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పెళ్లై 8 నెలల్లోపే అర్చన ఈ అకృత్యానికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భర్త హైదరాబాదులో, ప్రియుడితో భార్య ఎంజాయ్, అత్త చూసేయడంతో?