Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

సెల్వి
శనివారం, 1 మార్చి 2025 (11:26 IST)
drunken woman
బైకుపై విన్యాసాలు చేయడం ప్రస్తుతం యువతలో కొత్త ట్రెండ్. అదీ తాగి చేస్తుండటం ద్వారా వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో బైకును నడుపుతూ రొమాన్స్ చేసే జంటలు, విన్యాసాలు చేసే బైకర్ల వీడియోలు వైరల్ అవుతూనే వున్నాయి.
 
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ యువతి తప్పతాగి బైకుపై నిల్చుని హంగామా చేసింది. బైకును ఓ యువకుడు నడపగా, మరో యువకుడు నిల్చుని హంగామా చేసే యువతిని గట్టిగా పట్టుకుని వెనక కూర్చుని వున్నాడు. ఆ యువతి బైకు సీటుపై నిల్చుని నానా రభస చేస్తూ రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు. ఒకే బైక్‌పై ‌ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో నిల్చున్న యువతి రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ వెళ్లింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువతిపై మండిపడుతున్నారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో ఆ యువతీయువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments