Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Advertiesment
Fashion dress

ఐవీఆర్

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (23:29 IST)
హైదరాబాద్: వోక్సెన్ విశ్వవిద్యాలయంలోని ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ & డిజైన్ నిర్వహించిన రెండు రోజుల ఫ్యాషన్ షో అయిన వోక్సెన్ ఫ్యాషన్ వీక్, లా మోడ్ విజయవంతంగా ముగిసింది. ఫ్యాషన్ అభిమానులు హాజరైన ఈ కార్యక్రమానికి భారతీయ నటుడు మార్క్ రాబిన్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "సెవెన్ డెడ్లీ సిన్స్ విత్ ఎ సర్ప్రైజ్" పేరిట ఈ షోను నిర్వహించారు. 
 
ఈ సంవత్సరం ఫ్యాషన్ షోలో అతి ముఖ్యమైన అంశాలలో ఒకటిగా వదిలివేయబడిన వస్త్రాల వాడకం నిలిచింది. విద్యార్థులు వ్యర్థ పదార్థాలను అద్భుతమైన దుస్తులుగా మార్చారు, పర్యావరణ పరిరక్షణ, నైతిక ఫ్యాషన్‌ను పునరుద్ఘాటించారు. వోక్సెన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్-డిజైన్ హెచ్ఓడి డాక్టర్ ఆదితీ సక్సేనా మాట్లాడుతూ, “వోక్సెన్ ఫ్యాషన్ వీక్‌, లా మోడ్‌‌లో సృజనాత్మకత, సస్టైనబిలిటీ యొక్క సరిహద్దులను మా విద్యార్థులు దాటడం చూసి నేను గర్వపడుతున్నాను. అద్భుతమైన దుస్తులను సృష్టించడానికి వదిలివేసిన వస్త్రాలను ఉపయోగించడం వారి వినూత్న స్ఫూర్తికి, పర్యావరణ అనుకూల పద్ధతుల పట్ల నిబద్ధతకు నిదర్శనం. ఈ సంవత్సరం నేపథ్యం, 'సెవెన్ డెడ్లీ సిన్స్ విత్ ఎ సర్‌ప్రైజ్', వారి సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించింది” అని అన్నారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ సూపర్ మోడల్, నటుడు , అనుభవజ్ఞుడైన కొరియోగ్రాఫర్ మార్క్ రాబిన్సన్, లా మోడ్‌లో భాగంగా  విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకతను ఆసక్తిగా తిలకించడంతో పాటుగా వారిని అభినందించారు. తదుపరి తరం డిజైనర్లు పర్యావరణ అనుకూల పద్ధతులను స్వీకరించడం, ఫ్యాషన్ సరిహద్దులను పునర్నిర్వచించడం చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన 'వాట్స్ అరౌండ్ హైదరాబాద్' కూడా వోక్సెన్ ఫ్యాషన్ షోలో పాల్గొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?