మద్యం మత్తులో టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ రోడ్డుపై చిందులు వేస్తూ కేకలు పెడుతూ పోలీసులకు చుక్కలు చూపించింది. మేకల సరిత అనే యువతి మూవీ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. నిన్న రాత్రి పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించింది. చరణ్ అనే వ్యక్తిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటం వీడియోలో కనిపిస్తోంది. ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగగాడిని మాత్రం వదలను అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టింది.
ఆమెను సముదాయించి మామూలు స్థితికి తెచ్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేసారు. ఐతే పూటుగా మద్యం సేవించి వుండటంతో ఆమె ఎవ్వరి మాటలను పట్టించుకోలేదు. ఒక దశలో రోడ్డు పక్కనే వున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకునేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. ఆమె రోడ్డుపై అలాగే చిందులు తొక్కుతుండటంతో పోలీసులు ఆమె భర్తకి సమాచారం అందించారు. రోడ్డుపై న్యూసెన్స్ చేసిన సరితపై కేసు పెట్టారు.