Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని జబ్బులు ఉన్నవారికి 2డీజీ ఔషధం ఇవ్వరాదు : డీఆర్డీవో

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (14:58 IST)
భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని అభివృద్ధి చేసింది. అయితే, ఈ ఔషధ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. 
 
తాజాగా దీని వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో 2డీజీ ఔషధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడొద్దని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొంది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని వాడొచ్చని తెలిపింది. 
 
ప్రస్తుత చికిత్సకు అనుబంధంగానే దీన్ని వాడాలని సూచించింది. డాక్టర్లు గరిష్టంగా 10 రోజుల లోపు 2డీజీ వాడకాన్ని సూచించాలని వివరించింది. కొన్ని జబ్బులు ఉన్నవారికి 2డీజీ ఔషధం వాడేముందు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. 
 
డయాబెటిస్, తీవ్రస్థాయి గుండెజబ్బులు, హెపటిక్ రీనల్ ఇంపెయిర్ మెంట్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఉన్నవారిపై ఈ ఔషధాన్ని పరీక్షించలేదని వెల్లడించింది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఈ మందు వాడొద్దని డీఆర్డీవో స్పష్టం చేసింది.
 
2డీజీ ఔషధం కోసం 2DG@drreddys.comకి మెయిల్ చేయాలని తెలిపింది. అది కూడా కరోనా బాధితులు, లేదా వారి కుటుంబ సభ్యులు మెయిల్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments