తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా 'స్మార్ట్ కిచెన్' హామీ మేరకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చర్చించి ఇందుకు సంబంధించిన నిధులను సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులతో ఈ పథకం అమలు కోసం ఒక కమిటీని నియమించారు.
ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నారు. జులై 10 నుంచి పథకాన్ని మహిళలకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. కేరళలో మహిళల కోసం స్మార్ట్ కిచెన్ అనే కొత్త పథకాన్ని సీఎం పినరయి విజయన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
వంటింట్లో మహిళల పని భారాన్ని తగ్గించేందుకు 'స్మార్ట్ కిచెన్' పథకాన్ని సీపీఎం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద మహిళలకు సబ్సిడీ కింద వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, ప్రిడ్జ్‌లు, ఇతర కిచెన్ సామాన్లు ఏవైనా కొనుక్కోవచ్చు. వీటిని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే అందిస్తున్నది. కాగా ఇందులో మూడో వంతు మహిళలు చెల్లించవలసి ఉన్నది. మిగిలినదంతా ప్రభుత్వమే చెల్లిస్తోంది.