కరోనా రోగుల కోసం భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) - డాక్టర్ రెడ్డీస్ ల్యాంబ్ సంయుక్తంగా తయారు చేసిన ఔషధం 2-డీజీ (2-డియాక్సీ-డి-గ్లూకోజ్). ఈ మందు కరోనా రోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒక్కో సాచెట్ ధరను రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే డిస్కౌంట్ కూడా అందిస్తోంది డాక్టర్ రెడ్డీస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువకే లభించనుంది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కోవిడ్ బాధితులకు ఈ సాచెట్స్ ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తోందని డీఆర్‌డీఓ ప్రకటించింది.
నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అత్యవసర వినియోగం కింద అనుమతినిచ్చింది. ఈ నెల 17న తొలి విడతలో 10 వేల సాచెట్లను, 17న రెండో విడత కింద మరో 10 సాచెట్లను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది.