కోవిడ్ బాధితులకు శుభవార్త. కోవిడ్ బాధితుల కోసం డీఆర్‌డీఓతో కలిసి డాక్టర్ రెడ్డీస్ తయారు చేస్తున్న 2- డీజీ (2- డీయోగ్జీ- డి- గ్లూకోజ్) ఔషధం వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధ తయారీ మొదలుపెట్టామని, జూన్‌లో దేశీయ విపణిలోకి విడుదల చేస్తామని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది.
కోవిడ్-19 రోగులకు ఈ ఔషధాన్ని ఇస్తే, వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా నివారించడంతో పాటు వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్‌డీఓ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనిపై నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో దీన్ని విడుదల చేయడానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. దీంతో తయారీకి డాక్టర్ రెడ్డీస్ చర్యలు తీసుకుంది.