Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం భర్తకు డ్రగ్స్ ఇచ్చి చంపేసిన భార్య... ఎక్కడ?

కొంతమంది భార్యల కంటికి కట్టుకున్నోడి కంటే.. ఉంచుకున్నోడే గొప్పగా కనిపిస్తున్నాడు. ఫలితంగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను కర్కశంగా హతమార్చుతున్నాడు.

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (12:00 IST)
కొంతమంది భార్యల కంటికి కట్టుకున్నోడి కంటే.. ఉంచుకున్నోడే గొప్పగా కనిపిస్తున్నాడు. ఫలితంగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను కర్కశంగా హతమార్చుతున్నాడు. ఢిల్లీలో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తకే డ్రగ్స్ ఇచ్చి చంపేసిందో భార్య. ఆ తర్వాత అతని శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి శ్మశానవాటికలో పూడ్చిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ బేగంపూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 2007లో ఓ యువతితో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆ మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడనీ భావించిన భార్య.. భర్తకు మోతాదుకు మించి డ్రగ్స్ ఇచ్చి చంపేసింది. 
 
అయితే, ఎంతో ఆరోగ్యంగా ఉంటూ వచ్చిన తమ బిడ్డ ఉన్నట్లుండి మరణించడంతో ఆతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో కోడలి వ్యవహారశైలి, ఫోను సంభాషణలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె ఫోను‌ను పరిశీలించగా మరో వ్యక్తితో తరచూ మాట్లాడుతున్నట్టు తేలింది. 
 
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చినట్టు తేలింది. 
 
ఆ తర్వాత సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆదేశంతో పోలీసులు మంగోల్‌పురి శ్మశానవాటికలో తవ్వి కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికితీసి దాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. వివాహేతర సంబంధంతో భార్యే ప్రియుడితో కలిసి భర్తకు డ్రగ్స్ ఇచ్చి చంపిందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ఈ దారుమం ఈనెల 9వ తేదీన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments