కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదనీ భార్య - పిల్లలను హత్య చేసిన భర్త
తన కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను హతమార్చాడో కసాయి. ఆ తర్వాత తాను జైలుకెళ్తే తన పిల్లలు అనాథలైపోతారని భావించి వారిని కూడా చంపేసినట్టు ఓ కిరాతకుడు చెప్పాడు.
తన కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను హతమార్చాడో కసాయి. ఆ తర్వాత తాను జైలుకెళ్తే తన పిల్లలు అనాథలైపోతారని భావించి వారిని కూడా చంపేసినట్టు ఓ కిరాతకుడు చెప్పాడు. మీర్‌పేట ఠాణా పరిధి బడంగ్‌పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ పద్మశాలిపురానికి చెందిన సంగిశెట్టి సురేందర్(32) తెల్లాపూర్‌లోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా లింగంపల్లిలో శ్రీలక్ష్మీ ఆటో ఇంజినీరింగ్ వర్క్స్‌లో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య వరలక్ష్మి, పిల్లలు అయిదేళ్ల రితేష్, మూడేళ్ల యశస్విని ఉన్నారు.
అయితే, కుటుంబ కలహాలతో దంపతులు తరచూ గొడవపడేవారు. తన తల్లిదండ్రులను, సోదరిలను భార్య సరిగా చూసుకోవడంలేదని.. వారితో చక్కగా ప్రవర్తించేది కాదని సురేందర్ విభేదించేవాడు. ఉగాదికి రావాలంటూ అత్తవారు బడంగ్‌పేటకు ఆహ్వానించగా సురేందర్ భార్యాపిల్లలతో సోమవారం వెళ్లాడు. ఇంటికి వెళ్లిపోదామని.. అన్నయ్య వద్ద ఉన్న తన తల్లి వస్తుందని సురేందర్ మంగళవారం తెల్లవారుజామున వరలక్ష్మికి చెప్పగా వచ్చేందుకు నిరాకరించింది.
ఇంటికి రావొద్దన్నా అత్త ఎందుకు వస్తోందంటూ నిలదీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేందర్ పథకం పన్నాడు. మామ, బావమరిదిని కల్లు తేవాలంటూ బయటకు పంపించాడు. అత్త వంటగదిలో ఉండగా... బెడ్‌రూంలో ఉన్న భార్యను, కుమార్తెను గొంతునులిమి హత్యచేశాడు. బయట ఆడుకుంటున్న కుమారుడిని చరవాణిలో గేమ్ డౌన్‌లోడ్ చేస్తున్నానని పిలిచి.. హత్యచేసి కారులో పరారై వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సురేందర్‌ను అరెస్టు చేశారు.