Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్లు వేశ్యలు.. పచ్చని సంసారాలను కూల్చుతున్నారు : నిర్మాత భార్య

ఓ తమిళ అగ్ర నిర్మాత భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లను వేశ్యలతో పోల్చారు. వారు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిర్మాత పేరు జ్ఞానవేల్‌ రాజా. ఈయన భార్య నేహా. ఈ

Advertiesment
హీరోయిన్లు వేశ్యలు.. పచ్చని సంసారాలను కూల్చుతున్నారు : నిర్మాత భార్య
, బుధవారం, 21 మార్చి 2018 (17:41 IST)
ఓ తమిళ అగ్ర నిర్మాత భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లను వేశ్యలతో పోల్చారు. వారు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిర్మాత పేరు జ్ఞానవేల్‌ రాజా. ఈయన భార్య నేహా. ఈమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 
 
ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'మౌనంగా ఉండాలా? లేదా తుఫానులా విజృంభించాలా?.. నేను రెండోది ఎంచుకున్నాను' అని ట్వీట్‌ చేశారు. మహిళలే.. మహిళలకు శత్రువులు అవుతున్నారని అభిప్రాయపడ్డారు. తప్పుడు దారిలో నడుస్తూ.. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో కలహాలు సృష్టించే ఇలాంటి వారిని శిక్షించాలని పేర్కొన్నారు.
 
ఇంటిలో భర్తను నియంత్రించడం భార్య బాధ్యతని.. ఇదే సూత్రం భార్యలకు కూడా వర్తిస్తుందని ఆమె తెలిపారు. బరితెగించిన భార్యను నియంత్రించాల్సిన బాధ్యత కూడా భర్తకు ఉందన్నారు. ఇలాంటి మహిళల్ని పబ్లిక్‌లో కొడతానన్నారు. బహిరంగంగా హెచ్చరిస్తున్నానని, వీరిని వదలకూడదని చెప్పారు. త్వరలో వీరి పేర్లను కూడా బయటపెడతానని ఆమె పేర్కొన్నారు.
 
ఆ తర్వాత ఈ ట్వీట్లను డిలీట్ చేసి.. మళ్లీ కొత్త ట్వీట్లను పోస్ట్ చేశారు. 'కొన్ని సున్నితమైన విషయాలు వినోదానికి సరికావు. నేను చేసిన పోస్ట్‌ నా సొంత సమస్య కాదు, నా భర్తతో నాకు ఎటువంటి సమస్యలు లేవు. నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఇవి.. వారిని ఉద్దేశిస్తూ నేను మాట్లాడాను. 
 
పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. ప్రచారం కోసం నేను ఈ ట్వీట్లు చేయలేదు. సోషల్‌మీడియా చాలా శక్తిమంతమైన మాధ్యమం.. అందుకే దీన్ని ఎంచుకున్నా. కానీ దీని వల్ల విమర్శలు వస్తున్నాయి. అందుకే పాత ట్వీట్లు డిలీట్‌ చేశా. దయచేసి బాధ్యతగా మద్దతు తెలుపండి' అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం మీ పార్టీ.. రాజకీయంగా ఎమ్మెల్యే కావాలి... ఎవరన్నారు?