Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం చేయొద్దని భార్య అరచేయి నరికేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (10:40 IST)
ఉద్యోగం చేయొద్దని ఓ సీఆర్పీఎఫ్ జవాను భార్య చేయి నరికేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సతీష్ కుమార్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. అతడి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంది. అయితే, తన భార్య ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేని సతీశ్ కుమార్.. భార్యకు పలుమార్లు చెప్పారు. కానీ, ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కోసం అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది. 
 
ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లోని ఓ చిన్న హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారి మధ్య ఉద్యోగం విషయంపై మళ్లీ గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత సర్దుకునిపోయి, హోటల్ సిబ్బందితోనే భోజనం తెప్పించుకుని ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ భోజనంలో భార్యకు తెలియకుండా సతీశ్ కుమార్ మత్తు కలిపాడు. ఇది తెలియని ఆమె స్పృహ కోల్పోయింది. 
 
దీంతో ఆమెను మంచానిక కట్టేసి అరచేయి నరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది. లేచి చూసి తన పరిస్థితిని అర్థం చేసుకుని గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న బాధితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments